పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఒక సనిని చేయడం ద్వారా నేర్చుకునే ప్రక్రియనే ప్రయోగాత్మక అభ్యాసం అంటారని, అనుభవపూర్వక అభ్యాసం సాంకేతిక విద్యా సంస్థలలో అవశ్యమని కాప్రికాట్ టెక్నాలజీస్ ప్రొడక్ట్ మేనేజ్ ప్రేమ్ కుమార్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో మెషిన్ లెర్నింగ్ – ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ముగింపు ఉత్సవం బుధవారం నిర్వహించారు. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అనుభవపూర్వక అభ్యాసం నిపుణ్యాలు, ఆసక్తులు, అభిరుచులు, విలువలు, విభిన్న సంస్థలతో వ్యవహరించే నేర్పుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందన్నారు.

ప్రేమ్కుమార్తో పాటు టిక్-టాక్ – బోను ప్రదర్శించిన తాసుక్కు మార్ను ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టీ.మాధవి, నిర్వాహకుడు ప్రొఫెసర్ కె. మంజునాథాచారి శాలువా, జ్ఞాపికలను ఇచ్చి సత్కరించారు. ఈ అధ్యానిక వికాస కార్యక్రమంలో పాల్గొన్నవారు తమ అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. రిసోర్స్ పర్సను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈఈసీఈ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ రామకృష్ణ నందన సమర్పణతో ఈ మూడు రోజుల కార్యక్రమం ముగిసింది.
