ఫార్మసీ విద్యార్థులకు గీతమ్ లో ఉత్తేజకర పోటీలు

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం- 2024 (ఈనెల 25న) పురస్కరించుకుని ఫార్మసీ విద్యార్థుల కోసం. ఆకర్షణీయమైన పోటీలను నిర్వహించాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ సంకల్పించింది. ఈ పోటీలలో వ్యాస రచన, పోస్టర్ ప్రదర్శన, మౌఖిక ప్రదర్శన, క్విజ్ వంటివి ఉంటాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఫార్మసిస్టులు కీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని (ప్రస్పుటం చేసే లక్ష్యంతో వీటిని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఫార్మసీ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చని డాక్టర్ శివకుమార్ తెలియజేశారు. వ్యాస రచన పోటీలలో పాల్గొనేవారు ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర, టెలిఫార్మసీ వంటి అంశాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. సురక్షితమైన ఔషధ వినియోగ పద్ధతులు, గ్రామీణ ఆరోగ్యంలో అంతరాన్ని తగ్గించడం, మానసిక ఆరోగ్యానికి ప్రపంచ సహకారం వంటి విషయాలపై పోస్టర్ ప్రదర్శనను రూపొందించవచ్చని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య విధానం, ఇతర సంబంధిత రంగాలలో ఫార్మసిస్టుల నాయకత్వంపై మౌఖిక ప్రదర్శన చేయొచ్చన్నారు, ముగ్గురు లేదా నలుగురు జట్టుగా (విడివిడిగా పేర్లు. నమోదు చేసుకోవాలి) గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ప్రత్యక్షంగా నిర్వహించే క్విజ్ పోటీలలో పాల్గొనాలని చెప్పాడు.ఆసక్తి గల ఫార్మసీ విద్యార్థులు తను ఎంట్రీలను gpsa_hyd@gitam.in ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలని, విజేతలకు ఉత్తేజకర బహుమతులు, అవార్డులను ప్రదానం చేస్తామని ప్రొఫెసర్ శివకుమార్ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థి సమన్వయకర్తలను (7330 778 199 లేదా 89777 14744) సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *