మనవార్తలు ,పటాన్ చెరు:
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకుల విగ్రహాలను వాడాలని పిలుపునిచ్చారు . మట్టి విగ్రహాలను వాడటం వల్ల నీరు,గాలి వాతావరణం కాలుష్యం అవ్వకుండా కాపాడగలమని వివరించారు . ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత గా భావించి భావితరాలను రక్షించాలని బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ కోరారు. వినాయకచవితి పండుగ మట్టిగణపతితోనే ప్రారంభమైనదని దానిని గ్రహించి మట్టి బొమ్మల విశిష్టతను తెలుసుకొని మట్టి వినాయకుల తోనే వినాయకునితో పండగ జరుపుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో దీపక్, సల్మాన్, రాహుల్ ముదిరాజ్, కుమార్, అనిల్, నవిన్, వినిత్, లఖ్కన్ తదితరులు పాల్గొన్నారు.
