ప్రతి ఒక్కరు నిరుపేదలు ఆదుకోవాలి…
– కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్
పటాన్ చెరు:
లాక్‌డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్ అన్నారు. బుధవారం పటాన్చెరు పరిధిలో నిరుపేదలకు ఆహార పదార్థాలను, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా చిన్న ముదిరాజ్ మాట్లాడుతూ… సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ఫూర్తితో తన వంతు సాయంగా నిరుపేదలకు ఆహారపదార్ధాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సల్మాన్,శ్రీనివాస్, గాలయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, ఎస్ వై రాజు తదితరులు పాల్గొన్నారు.