మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒకరు మొక్కను నాటాలని మెట్రో రైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్స సందర్బంగా రాజన్ సింగ్ నివాసంలో మొక్కలను నాటారు. అనంతరం మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ పటాన్ చెరు లాంటి కాలుష్యకారక ప్రాంతాలలో పర్యావరణాన్ని కాపాడుకొని పచ్చదనన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు మొక్కలు విరివిగా నాటి కాపాడుకోవాలని అన్నారు .ఇదే సందర్భంలో మెట్రో రైల్ ఆవశ్యకత గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళనున్నట్టు మెట్రో మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించడం వల్ల ప్రజల సమయంతో పాటు పర్యావరణం కూడా పరిరక్షించబడుతుందని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్ రాజన్ సింగ్ మెట్టు శ్రీధర్ అబ్దుల్ బాసిత్ మహేష్ పాప రాజు నరేష్ చిన్నా జంగయ్య బంటి వేంకటేష్ శ్రీకాంత్ షేక్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.