మనవార్తలు ,తెల్లాపూర్:
ఓ పూట ఆకలి తీర్చొచ్చు. విద్యా దానం చేస్తే.. జ్ఞానం పంచొచ్చు. అదే రక్తదానం చేస్తే.. ప్రాణదాతలు కావొచ్చు. అందుకే అన్ని దానాలంటే కంటే రక్తదానం గొప్పదంటారు. రక్తదానం చేయండి చేయించండి అని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని ఆమె ప్రారంభించారు .అనంతరం కాట సుధా శ్రీనివాస్ గౌడ్ రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు.రక్తదానం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు. యూత్ సభ్యులు దాదాపుగా 30 మందికి పైగా రక్తదానం చేయడాన్ని కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు ,మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, సి ప్రభాకర్ రెడ్డి, నరసింహ, నరేందర్, సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.