మనవార్తలు ,పటాన్చెరు:
ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. చిట్కుల్ గ్రామ పరిధిలోబడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని విద్యార్థులతో కలిసి అవగాహనా ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని. తెరాస ప్రభుత్వం బలోపేతం చేస్తూ ఆంగ్ల విద్యను సైతం ఈ ఏడాది నుంచి అందిస్తుందని ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించి, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలని ఆయన తెలిపారు .ప్రతి ఒక్క తల్లిదండ్రులు అవగాహన పెంచుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.