శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం లో 65లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ 15ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలను హైదరాబాదు లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మిట్ లో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించలేదని, అలాగే ప్రతిపక్ష పార్టీ లు అయిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ,లాంటి పార్టీ లు కూడా ముదిరాజ్ లకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించటం లేదని, కాబట్టి తెలంగాణ రాష్ట్రoలో అత్యదిక జనాభా కలిగిన ముదిరాజ్ ల సమస్యల పై మరియు ముదిరాజ్ ల రిజర్వేష్లపై జరుగుతున్న అన్యాయాల పై ప్రశ్నించాటానికి చైతన్య వేదిక ఎల్లప్పుడు ముదిరాజ్ ల గొంతుకగా పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ముదిరాజ్ లకు జరుగుతున్న అన్యాయాలపై, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజక వర్గాలలో ముదిరాజ్ ల ఆత్మ గౌరవ రథ చైతన్య యాత్ర చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా మొదటి విడుతలో పరిగి, తాండూరు, కొడంగల్, నారాయణ పేట, మక్తల్, మహబూబ్ నగర్, గద్వాల, కొత్తకోట, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలను పర్యటించడం జరిగింది. రెండో విడుతగా షాద్ నగర్, జడ్చర్ల, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, సంగారెడ్డి, నర్సాపూర్ లలో పర్యటన ఉంటుంది. అంతే కాకుండా అక్టోబర్ 1వ తేదీన నాం పల్లి, ఎక్స్ బిషన్ గ్రౌండ్ లో లక్ష మందితో ముదిరాజ్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు కోట్ల పుష్పాలత, వైస్ ప్రెసిడెంట్ కురుమూర్తి, జనరల్ సెక్రెటరీ రమేష్ ముదిరాజ్, జాయింట్ సెక్రటరీ నర్సింహులు ముదిరాజ్, కన్వీనర్ సంజయ్ ముదిరాజ్, కో ఆర్డినేటర్ వెంకటేష్ ముదిరాజ్, నవెన్న ముదిరాజ్, కార్యవర్గ సభ్యులు ప్రేమలత ముదిరాజ్, కార్తిక్ పాల్గొన్నారు.