భవిషత్ లో ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి
పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన
నవభారత్ నిర్మాణ్ యువసేన అద్యక్షుడు మెట్టుశ్రీధర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మినీ ఇండియాగా పేరుపొందిన పటాన్‌చెరు పారిశ్రామిక వాడా అయినటువంటి పాశామైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించడం చాలా బాధాకరం అని నవభారత్ నిర్మాణ్ యువసేన అద్యక్షుడు మెట్టుశ్రీధర్ అన్నారు.యాజమాన్యం నిర్లక్ష్యం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి పరిశ్రమ ఘటన చోటు చేసుకుందని.తెలిపారు. ఘటనలు జరిగితేనే అధికారుల పర్యటనలు చేసి తర్వాత గాలికి వదిలేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో కంపెనీ యాజమాన్యాలు లాభాలే తప్పా కార్మికుల భద్రత పట్టడం లేదన్నారు.అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా మేల్కొని భాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాధితులకు కోఠి రూపాయల నష్టపరిహారం చెల్లించి క్షత్ర గాత్రులకు యాభైలక్షల పరిహారం ఇవ్వాలని మెట్టుశ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ,లింగం రవీందర్, లక్ష్మణ్ డప్పు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
