శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరుతూ ఎ ఐ టి యూ సి అనుబంధ సంస్థ అవుట్ సోర్సింగ్ సిబ్బంది శుక్రవారం రోజు కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న తమకు కార్మిక జీవో ప్రకారం 13600 వేతనం ఇవ్వాల్సి ఉండగా కేవలం 11 వేలు మాత్రమే చెల్లెస్తున్నారని, అదికూడా మూడు, నాలుగు నెలలకు ఒకసారి చెల్లెస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై ఆసుపత్రి సూపరిండెంట్ కు వినతి పత్రం ఇచ్చామని, మా డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో శ్రావణ్ కుమార్ యాదవ్ రాజు, భాగ్య, మల్లేశ్వరి, అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఆసుపత్రి లో 45 మంది అవసరం ఉండగా, 40 మంది మాత్రమే పనిచేస్తున్నారని, సెక్యూరిటీ విభాగం లో 12 మంది ఉండగా 8 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు.