సవాళ్లను అధిగమిస్తేనే వ్యవస్థాపకులుగా రాణించగలరు’

politics Telangana

_గీతం వీడీసీ కార్యశాలలో వక్తల అభిభాషణ

పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి :

ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యవస్థాపకులుగా రాణించాలంటే, అనునిత్యం ఎదురయ్యే ఆటుపోట్లను. అధిగమిస్తూ, సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే సాధ్యపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (సిడీపీ) గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ స్టార్టప్ స్కూల్’లో భాగంగా, సోమవారం ‘కార్పొరేట్ కరెక్ట్, స్టార్టప్ సిమ్యులేటర్’ కార్యక్రమాలను నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్త క్రితీష్ కుమార్, అదానీ పోర్ట్స్, సెజ్ ఇన్నోవేషన్ మేనేజర్ సుబ్రమణ్యం నాడార్, ఇమ్మర్పిన్ సొల్యూషన్ ఎండీ, ముఖ్య కార్యనిర్వహణాధికారి రోషన్ రావలు ఈ కార్యక్రమాలలో పాల్గొని వర్ధమాన వ్యవస్థాపకులకు మార్గదర్శనం చేశారు. స్టార్టప్ – కార్పొరేట్ ప్రపంచాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారు తమ అనుభవాలు, నైపుణ్యాలను విద్యార్థులతో పంచుకోవడంతో పాటు పలుఅంతర్దృష్టులను అందించారు.

స్టార్టప్ – కార్పొరేట్ పర్యావరణ వ్యవస్థపై సంపూర్ణ అవగాహన కల్పించారు. ఆవిష్కరణ,వ్యవస్థాపకత, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, స్టార్టప్ కార్పొరేట్ ఎకోసిస్టమ్ వంటి అంశాలను వారు వివరించారు.చివరగా, స్టార్టప్ సిమ్యులేటర్ నిర్వహించి, విజయవంతమైన స్టార్టప న్ను నిర్మించే, అభివృద్ధి చేసి ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను విద్యార్థులు స్వయంగా అనుభూతి చెందారు. ముఖ్యంగా వాటాదారుల విశ్లేషణ, స్వాట్ అనాలిసిస్ (బలాలు, బలహీనతలు, అవకాశాలు, అపాయాలు) పెట్టుబడిదారులతో అనుసంధానం వంటి సంక్లిష్ట అంశాలను వారికి విశదీకరించారు. విభిన్న వ్యూహాల గురించి తెలుసుకోవడానికి, నిర్ణయాత్మక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *