త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాల ముగింపు

politics Telangana

_విజేతలకు బహుమతుల అందజేత

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :

శేరిలింగంపల్లి మండల పరిధిలో గల మధనాగూడలోని త్రివేణి పాఠశాలలో మంగళవారం. ప్రారంభమైన వార్షిక క్రీడా సంబరాలు శుక్రవారం రోజు ఘనంగా ముగిశాయి. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిలుగా హకి ట్రిపుల్ అర్జున అవార్డు గ్రహిత, పద్మశ్రీ నందమూరి ముఖష్ కుమార్, త్రివేణి, కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ జగదీష్, మరియు రంగారెడ్డి జిల్లా హాకీ ఫెడరేషన్ సెక్రటరి బాస్కర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మాట్లాడుతూ స్కూల్ యజమాన్యం చదువులో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఆటల పోటీలలో పాల్గోని విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్స్. మెమెంటోస్ లో అందజేశారు. క్రీడల వల్ల ఏకాగ్రత, మానసిక, శారీరక దృఢత్వానికి ఆటలు ఉపయోగపడుతాయని. తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక క్రమాలు అందరిని అలరించాయి. ఇలాంటి కార్యక్రమం నిర్వహించి నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో సిఎ సి డా. నటరాజ్, సి ఆర్ ఓ సాయి నరసింహారావు, సి, ఎ.ఓ చంచారావు, సెంట్రల్ ఐఐటి కో ఆర్డినేటర్ చక్రి, సి.ఎస్. ఓ సుబ్బారావు, పాఠశాల ప్రిన్సిపల్స్ జగదీష్, అర్చన, అనిత మాళిని, వైస్ ప్రిన్సిపర్స్ హిమబిందు. అఫ్రికా మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయతర బృందం. తల్లిదండ్రులు. విద్యార్థులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *