– గీతం బీస్కూల్ ఆతిథ్య ఉపన్యాసంలో అమెరికా ప్రొఫెసర్ రామ్మూర్తి
మనవార్తలు ,పటాన్ చెరు:
వర్ధమాన మార్కెట్లు తను వ్యూహాత్మక కార్యక్రమాలను రూపొందించడంలో అంతర్జాతీయ వ్యాపారులను ఆకర్షించాయని , బహుళజాతి సంస్థలకు ధీటుగా దేశీ కంపెనీలూ రాణిస్తున్నాయని అమెరికా , బోస్టన్లోని సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ రావి రామ్మూర్తి అన్నారు . గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి ‘ బహుళజాతి కంపెనీల అంతర్జాతీయ వ్యాపార ప్రణాళిక రూపకల్పనలో భారతదేశం పాత్ర అనే అంశంసే శుక్రవారం ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు . అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో స్థిరమైన వ్యాపార వృద్ధిని నిర్ధారించడానికి బహుళజాతి కంపెనీలు అవలంబిస్తున్న అమ్మకం , వనరులు , ఆవిష్కరణలు , నేర్చుకోవడం అనే నాలుగు పార్శ్వాలను ఆయన ఆవిష్కరించారు . జీఈ ( జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ ) జిల్లెట్ , ప్యాంపర్స్ , ఎం – బ్యాంకింగ్ వంటి ప్రపంచ బ్రాండ్ గురించి ఆయన సోదాహరణంగా వివరించారు .
తన మానస పుత్రిక అయిన ‘ రివర్స్ ఇన్నోవేషన్ ‘ ప్రక్రియను అనుసరించడంలో ‘ ప్రత్యక్ష ఉదాహరణలను ప్రొఫెసర్ రామ్మూర్తి ఈ సందర్భంగా ఉటకించారు . ఈ ఆతిథ్య ఉపన్యాసాన్ని ఏర్పాటు చేయడంలో గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిష్ కీలక భూమిక పోషించారు . తొలుత , గీతం బీస్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ అతిథిని స్వాగతించి , సత్కరించారు . ఈ కార్యక్రమంలో హెబీబీఎస్ అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొని గొప్ప అభ్యాస అనుభవాన్ని పొందారు . పలు సందేహాలను అతిథిని అడిగి నివృత్తి చేసుకున్నారు .