మేడ్చల్
ఈ దృశ్యం మల్కాజిగిరి – మేడ్చల్ జిల్లా , నేరెడ్మెట్ మండల్, సమతా నగర్ కాలనీ లో దర్శనమిస్తుంది. తెలంగాణ విద్యుత్ శాఖ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతుంది. విద్యుత్ తీగలు చిందర వందర గా వేలాడుతున్న విద్యుత్ శాఖ అధికారులు ఏటువంటి చర్యలు చేపట్టడం లేదు. దీనికి తోడు నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. విద్యుత్ తీగలు ఏ సమయంలో వారి మీద పడుతుంది అని పాదచారులు , వాహన చోదకులు అటు పక్క నుండి వెళ్ళటానికి భయపడుతున్నారు.ఈ సమయస్యను త్వరగా పరిష్కరించలని స్థానికులు విన్నవించుకుంటున్నారు
