మనవార్తలు, శేరిలింగంపల్లి :
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల ఫలితాలు ప్రగతికి పట్టం కట్టాయని, ప్రజలు మత, కులాలకు అతీతంగా తీర్పు చెప్పారని బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు, చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్ఠి సింధూ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఫలితాల తదనంతరం మీడియాతో మాట్లాడుతూ. బిజెపిని ఓడించాలని అబద్ధాలు, అసత్యాలు, కుట్రలు ఎన్ని చేసినా ప్రజల తీర్పు వారికి చెంపపెట్టని అన్నారు. అసత్య ప్రచారాలు, కుల, మత విద్వేషాలను ప్రజలు అధిగమించి సమర్థ పాలనకు ఓటు వేశారని ఆమె అన్నారు. ఈ ఫలితాలతో కొందరి కలలు కల్లలు గానే మిగిలిపోతాయని ఆమె అన్నారు. పంజాబ్ ప్రజలు ఇచ్చిన తీర్పు విలక్షణంగా ఉన్నా, ఆప్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కసిరెడ్డి సింధూ తెలిపారు. ఉత్తర భారత ఫలితాల ప్రభావం తెలంగాణ పై ఉంటుందని, భవిష్యత్ తెలంగాణ బిజెపి దేనిని ఆమె ధీమా వ్యక్తం చేశారు.