పటాన్ చెరు అమీన్పూర్ ఆర్యవైశ్య మహాసభ మండల కార్యవర్గ ఎన్నిక

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

ఆర్యవైశ్యలు ప్రతి ఒక్క రంగాలలో ఎదగాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ తోపాజి అనంత కృష్ణ అన్నారు పటాన్ చెరు వాసవీ భవన్ లో జరిగిన ఆర్య వైశ్య కులస్థుల కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై పటాన్ చెరుమండలం మరియు అమీన్పూర్ మండలం ఆర్యవైశ్య మహాసభ ఎన్నికైన కార్యవర్గ మండలితో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం వారికి శాలువా కప్పి ప్రశంస పత్రాన్ని అందజేశారు ,ఈ సందర్భంగా శ్రీ తోపాజి అనంత కృష్ణ మాట్లాడుతూ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి నన్ను పిలవడం చాలా సంతోషకరం అని అన్నారు.

మన ఆర్యవైశ్యులకు వైష్ణవి మాత ఆరాధ్య దైవం ప్రతి గ్రామాలలో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలలో ఆర్య వైశ్యులు సంఘాలు ఏర్పరచుకుంటున్నారు అని మనమందరం ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటూ విద్యా రంగంలో కానీ, రాజకీయాలలో కానీ, అనేక రంగాలలో మనమందరం ఎదగాలని కొత్తగా ఎన్నికైనా కార్యవర్గ సభ్యులందరికి ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పని చేయాలని అలాగే అందరికి శుభాభినందనాలు తెలిపారు .

కొత్తగా ఎన్నుకున్న సభ్యులు పటాన్ చెరు మండల అధ్యక్షుడు బుస్సా జయప్రకాష్, ఉపాధ్యక్షులు జూలకంటి శ్రీనివాస్, గార్లపాటి రామకృష్ణ,కొండూరు ప్రభు, ఎర్రం విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి, శ్రీకాంత్ గుప్తా కోశాధికారి మరియు అమీన్పూర్ మండల సభ్యులు కొండా లక్ష్మణ్ అధ్యక్షుడు, జి.సంతోష్ ఉపాధ్యక్షుడు, కన్నయ్య గారి బాల మనోహర్ ప్రధాన కార్యదర్శి, వీరందరికి పటాన్ చెరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోలి మల్లేశం, బేలిజం శ్రీనివాస్ గుప్తా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గోలి మల్లేశం పటాన్ చెరు పట్టణ అధ్యక్షులు, పట్టణ కోశాధికారి పి. ప్రదీప్ కుమార్, మండల అధ్యక్షుడు గంగిశెట్టి భూకైలాస్, రామ్మోహన్ గంగిశెట్టి రమేష్,త్యర్ల వీర పక్ష , కళ్యాణ్ రామ్, చంద్ర శేఖర్, ఆర్.జగదీష్,వి.రమేష్ వి.నాగభూషణం, కొండ మనోహర్ మరియు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *