పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
వచ్చే నెల 6న పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరులో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత పెద్దలు, బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వలన ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరగలేదని.. ఈ నేపథ్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ముస్లింలందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు సోమి రెడ్డి, నగేష్ యాదవ్, మెరాజ్ ఖాన్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.