మెట్లబావుల పునరుజ్జీవానికి కృషిచేయాలి

Telangana

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పిలుపునిచ్చిన ప్రఖ్యాత రూపశిల్పి యశ్వంత్ రామమూర్తి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సాంస్కృతిక మైలురాళ్ల వంటి మెట్లబావులను సంరక్షించుకోవాలని, మన వారసత్వ సంపదను పరిరక్షించు కోవడంతో పాటు వాటి పునరుజ్జీవానికి కృషిచేయాలని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ యశ్వంత్ రామమూర్తి పిలుపునిచ్చారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ‘తెలంగాణ మర్చిపోయిన మెట్లబావులు’ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. తెలంగాణ సాంస్కృతిక ప్రకృతి దృశ్యంలో కీలకమైన, ఇంకా తరచుగా విస్మరించబడిన మెట్లబావుల ప్రాముఖ్యతపై దృష్టిసారించి, ఈ ప్రాంతం యొక్క నిర్మాణ వారసత్వం యొక్క గొప్ప అన్వేషణను ఆవిష్కరించారు.తెలంగాణలోని మెట్లబావులను గుర్తించి, వాటిని డాక్యుమెంట్ చేయడానికి అంకితం చేసిన తన విస్తృతమైన ఆరేళ్ల ప్రయాణంపై రామమూర్తి, తన లోతైన అవగాహనను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ అద్భుతమైన నిర్మాణాల యొక్క చారిత్రక, సామాజిక, ఆర్థిక అంశాలపై పలు వివరాలను వెల్లడించడమే గాక, చరిత్ర అంతటా నీటి సంరక్షణ, సమాజ జీవితంలో వాటి కీలక పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ఈ ఉపన్యాసాన్ని విన్న విద్యార్థులకు మెట్లబావుల నిర్మాణ అంశాలపై లోతైన అవగాహనతో పాటు, అమూల్యమైన జ్జానాన్ని అందించారు. ఇది ప్రస్తుత ఆర్కిటెక్చర్ విద్యార్థులతో పాటు ఫీల్డ్ లోని నిపుణులకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.తొలుత, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ సీనియర్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ కరుణాకర్.బి, యశ్వంత్ రామమూర్తిని స్వాగతించి, సత్కరించారు. చివరగా, ఆర్కిటెక్చర్ డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా వందన సమర్పణ చేశారు.ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా, నిర్మాణ వారసత్వంపై విద్యార్థులకు లోతైన అవగాహనను పెంపొందించడమే గాక, విస్తృత సమాజంలో వారసత్వ పరిరక్షణకు వినూత్న విధానాలను స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోత్సహిస్తోంది.

 

సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఇంటీరియర్ డిజైనర్ ది కీలక పాత్ర: బందన్ కుమార్ మిశ్రా

కార్యాచరణ, సౌందర్యాలను మెరుగుపరచడలో ఇంటీరియర్ డిజైనర్ పాత్ర, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అంతర్గత డిజైన్లను రూపొందించడంలో వారి కీలక భూమికలను గీతం స్కూల్ ఆఫ్ డైరెక్టర్ బందర్ కుమార్ మిశ్రా వివరించారు. కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. సమకాలీన ఆర్కిటెక్చర్ లో ఇంటీరియర్ డిజైనర్ పాత్ర, వారి బాధ్యతలు, బహుముఖ స్వభావాల గురించి అక్కడి విద్యార్థులకు డాక్టర్ మిశ్రా లోతైన అవగాహనను కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *