మన వార్తలు ,అమీన్పూర్
మహిళల స్వయం సమృద్ధికి, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమిన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ మల్లేష్ తన సొంత నిధులతో నిర్మించిన మహిళా సమైఖ్య భవనాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు, సంక్షేమ పథకాల అమలులో ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.