పటేల్ గూడలో ఘనంగా వన మహోత్సవం
నూతన దేవాలయాల నిర్మాణాలకు.. అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో మాజీ ఎంపీపీ దేవానంద్ సొంత నిధులతో నిర్మించిన శ్రీశ్రీశ్రీ దుర్గామాత దేవాలయం స్వాగత తోరణాన్ని శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని అన్నారు.
వనమోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్
భవిష్యత్తులో మానవ మనుగడ కొనసాగాలంటే ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే జిఎంఆర్ ఉన్నారు.మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పటేల్ గూడ గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని.. మొక్కలు నాటారు.ఈ కార్యక్రమాల్లో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసి లు, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.