హైదరాబాద్
నాలుగో సారి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ గా డాక్టర్ లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులతో చర్చల అనంతరం రామకృష్ణ గౌడ్ కే మరోసారి ఛైర్మన్ పదవి దక్కింది.తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకమండలిలో 30 మందితో కూడిన కొత్త పాలక వర్గం కొలువుదీరింది. ఈ ఛాంబర్ లో ఎనిమిది వేల మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. కరోనా సమయంలో తెలంగాణ పిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ చేశామని కొత్తగా మరోసారి ఎన్నికైన రామకృష్ణ గౌడ్ తెలిపారు.
కరోనా సమయంలో చనిపోయిన కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు . సభ్యుల సంక్షేమం కోసం ఈ సారి మరిన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు . ఈ సందర్భంగా Tfcc మెంబర్ & ప్రొడ్యూసర్, వీఎస్ కే ఫిలిమ్స్ ,V10 TV ఛైర్మన్, ABJF తెలంగాణ స్టేట్ స్పోక్స్ పర్సన్ డా.వి.సురేష్ కుమార్ గారు లయన్ డా. ప్రతానీ రామకృష్ణ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు.