Telangana

ఉత్తమ సమీక్షకుడిగా డాక్టర్ హేమరాజు….

మనవార్తలు , పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ హేమరాజు పొల్లాయి , లండన్లోని శాస్త్రవేత్తలు , డెవలపర్లు , ఫ్యాకల్టీల సంఘం ( ఏఎస్ఈఎఫ్ ) నుంచి అత్యుత్తమ సమీక్షకుడిగా ప్రశంసా పత్రాన్ని పొందారు . ఈ విషయాన్ని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి . ఇంతకు మునుపు ‘ అమెరికన్ జర్నల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సంపాదకవర్గ ( ఎడిటోరియల్ బోర్డు ) సభ్యులలో ఒకరిగా 2018 లో డాక్టర్ హేమరాజు నియమితులయ్యారని , ఈ హోదాలో ఆయన పరిశోధక పత్రాలను సమీక్షించడంతో పాటు వాటి నాణ్యతను పెంపొందించేందుకు తోడ్పడుతున్నట్టు తెలియజేశారు .

నెదర్లాండ్స్లోని ( ఆమ్నెస్టర్మ్ ) ఎల్వేర్ కాంపాజిట్ స్ట్రక్చర్స్ ఎడిటర్స్ 2017 లో అత్యుత్తమంగా సహకరిస్తున్న సమీక్షకుడిగా ప్రశంసా పత్రాన్ని అందజేసిందని , సెమి కండక్టర్స్ , ఆప్టోఎలక్ట్రానిక్స్ , నానోస్ట్రక్చర్స్పై 2022 ఏప్రిల్ 14-16 తేదీలలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానిత ఉపన్యాసకుడిగా కూడా డాక్టర్ హేమరాజు గౌరవం పొందినట్టు వివరించారు .

ఉత్తను సమీక్షకుడిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన డాక్టర్ హేమరాజును గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలువురు విభాగాధిపతులు , అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

17 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

19 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago