గీతం నూతన వీసీగా డాక్టర్ ఎర్రోల్ డిసౌజా

Telangana

టౌన్ హాల్ సమావేశంలో సిబ్బందికి పరిచయం చేసిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఉప కులపతి (వీసీ)గా ప్రముఖ విద్యావేత్త, బహుముఖ ప్రజ్జావంతుడు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ ఎర్రోల్ డిసౌజా నియమితు లయ్యారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ బుధవారం ఆన్ లైన్ లో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఈ విషయాన్ని సిబ్బందికి వెల్లడించి, నూతన వీసీని అందరికీ పరిచయం చేశారు.డాక్టర్ డిసౌజా నియామకం పట్ల గీతం అధ్యక్షుడు శ్రీభరత్ తన హర్షాన్ని వ్యక్తంచేస్తూ, ‘ప్రొఫెసర్ డిసౌజాతో నా సంభాషణలలో, మా కొత్త దృక్సథంతో ఆయన ఎంత దగ్గరగా ఉన్నారో చూసి నేను ముగ్ధుడయ్యాను. మార్పు తీసుకురావడాని నిజాయితీ, కరుణలతో ముందుకు సాగే గీతం, అసాధారణమైన జ్జాన-ఆధారిత సంస్థ అవుతుంది. ముఖ్యంగా నిజాయితీ, కరుణ విలువల పట్ల ఆయన నిబద్ధత – నేను ఎంతో గౌరవించే సూత్రాలు – మమ్మల్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి’ అని వ్యాఖ్యానించారు.

డాక్టర్ ఎర్రోల్ డిసౌజా ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్, ముంబై విశ్వవిద్యాలయంలో ఐఎఫ్ సీఐ చైర్ ప్రొఫెసర్ గా, పారిస్ లోని సైన్సెస్ పోలో ఇండియా చైర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఆయన పీహెచ్ డీ పట్టా, ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టాలను పొందారు. అక్కడ ఆయన విద్యా నైపుణ్యానికి గుర్తింపుగా కాశీనాథ్ త్రింబక్ తెలాంగ్ బంగారు పతకం లభించింది.తన విశిష్టమైన కెరీర్ లో, డిసౌజా కొలంబియా విశ్వవిద్యాలయంలో విజిటింగ్ స్కాలర్ గా, సిమ్లాలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో సీనియర్ ఫెలో వంటి వివిధ ప్రతిష్టాత్మక పదవులను నిర్వహించారు. ఆయన విస్తృతమైన పాలనా అనుభవంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ద్రవ్య విధానంపై సాంకేతిక సలహా కమిటీలో, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్- రెండింటిలోనూ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. వెల్లూరులోని సీఎంసీ పాలక మండలిలో కూడా పాలుపంచుకోవడమే గాక, ఉదయపూర్ లోని శ్రమ్ సారథి డైరెక్టర్ల బోర్డులో పనిచేస్తున్నారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ లోని కమిటీలకు కూడా డాక్టర్ డిసౌజా సేవలు విస్తరించాయి. భారత ప్రణాళికా సంఘం, నీతి ఆయోగ్ కార్యకలాపాలలో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు. జర్నల్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఇండియన్ జర్నల్ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ సంపాదకీయ బోర్డులలో ఆయన పనిచేస్తున్నారు. డాక్టర్ డిసౌజా ఇటీవలి ప్రచురణ, ‘కాన్సెప్చువలైజింగ్ ది యుబిక్విటీ ఆఫ్ ఇన్ఫార్మల్ ఎకానమీ వర్క్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

డాక్టర్ డిసౌజా దార్శనిక నాయకత్వంలో, గీతం అనువర్తిత విద్య, అనువాద పరిశోధనలో దాని ప్రభావాన్ని మరింతగా పెంచడం, నైపుణ్యం, కరుణ- రెండింటితో వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులను శక్తివంతం చేయడం, ప్రపంచ స్థాయిలో సామాజిక పురోగతిని నడిపించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *