ఇస్నాపూర్ లో అంబరాన్ని అంటిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలు

politics Telangana

_వేల సంఖ్యలో తరలివచ్చిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అంబేద్కర్ అభిమానులు

_ప్రతి గ్రామం నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీలు..

_అంబేద్కర్ స్ఫూర్తి తో తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దిక్సూచిగా నిలుస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ చౌరస్తాలో 30 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన 12 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులు, వేలాది మంది ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని అన్నారు. సాధించుకున్న తెలంగాణలో దళితుల ఆర్థిక స్వావలంబన కోసం వివిధ పథకాలు ప్రవేశ పెట్టడంతో పాటు, విద్య రంగంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పటాన్చెరు నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు వారి ఆశయ సాధనకు సంపూర్ణంగా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడంతో పాటు, 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.పటాన్చెరు మండల పరిధిలోని పాటి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న స్టేడియానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నామకరణం చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అద్యక్షులు, ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *