గీతం ఫార్మశీ స్కూల్ ఆతిథ్య ఉపన్యాసంలో డాక్టర్ అకినో వ్యవస్థాపకుడు జ్ఞానేశ్వర్ జాదవ్

Districts politics Telangana

రోగ్య సంరక్షణలో కృత్రిమమేథ కీలకభూమిక..

పటాన్ చెరు:

ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథ ( ఏఐ ) కీలక భూమిక పోషిస్తోందని బ్రిటన్కు చెందిన డాక్టర్ అకినో ఏఐ వ్యవస్థాపకుడు డాక్టర్ జ్ఞానేశ్వర్ జాదవ్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ మంగళవారం ఏర్పాటుచేసిన ఆతిథ్య ( వర్చువల్ ) ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ , భవిష్యత్తులో కృత్రిమ మేథ ద్వారా మెరుగైన వైద్యం , చికిత్సా విధానాలతో రోగి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చన్నారు . అంతేకాక , వెద్యులకు కీలకమైన ఔషధపరమైన అంతర్దృష్టిని అందించడానికి , సురక్షితమైన , సులువుగా బదిలీ చేయగల వైద్య చరిత్రను నిర్ధారించడానికి సాంకేతికత ఆధారిత వేదికను అందించగల వివిధ మార్గాలను ఆయన వివరించారు .

విభిన్న సంస్కృతులు , ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల మధ్య అంతరాన్ని తగ్గించడానికి , సురక్షితమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్ధారించడంలో కూడా కృత్రిమ మేథ తోడ్పడుతుందన్నారు . విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తగిన వివరణలిచ్చి ఆకట్టుకున్నారు . తొలుత , స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథిని స్వాగతించగా , అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ బారిక్ పరిచయం చేశారు . దాదాపు 200 మంది విద్యార్థులు , అధ్యాపకులు , పరిశోధక విద్యార్థులు ఈ ఆతిథ్య ఉపన్యాసంలో పాల్గొన్నారు .

 

గీతమ్ గంగోత్సవ్…

గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతియేటా నవంబర్ 1 నుంచి 3 వ తేదీ వరకు గంగా ఉత్సవ్ను జరుపుకుంటారు . అందులో భాగంగా , గీతం ఎన్సీసీ విద్యార్థులు మంగళవారం ఈ ఉత్సవాన్ని నిర్వహించడంతో పాటు సామాన్య ప్రజలకు దీనిపై అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు . గంగా నది పునరుజ్జీవనంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ ఉత్సవ ప్రధాన లక్ష్యంగా వారు పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *