_పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావడం ప్రజల విజయం_కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను మొదటి ప్రాధాన్యత స్థానికులకే కల్పించాలని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని కొల్లూరు లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించిన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ కొల్లూరులోని డబుల్ బెడ్ రూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్, రాంసింగ్ నాయక్ లకు ముందుగా అపాయింట్మెంట్ ఇచ్చి, పాసులు కూడా అందజేసినప్పటికీ సీఎం కేసీఆర్ ని కలవనీయకుండ వారిని ముందస్తు హౌస్ అరెస్ట్ చేసి అవమానించడం విడ్డూరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొల్లూరు ప్రజలందరూ సహకరిస్తేనే డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. సహకరించిన స్థానిక ప్రజలకు డబుల్ బెడ్ రూములు కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు . 50% డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికులకు అందజేసిన తర్వాతనే,మిగిత ప్రాంత పేదలకు ఇవ్వాలన్నారు . పేద ప్రజల తరఫున స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై గళం విప్పాలన్నారు. స్థానిక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామి ఇచ్చారు . పేద ప్రజల మీద ప్రేమతో డబుల్ బెడ్ రూములను సీఎం ప్రారంభించలేదని, ఇది ఎలక్షన్ స్టంట్ లో భాగమేనని కాటా విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకులకు పరిపాలన మీద ధ్యాస లేదని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు . అధికార పార్టీ నాయకులకు భూముల మీద అవగాహన తప్ప, అభివృద్ధి పైన శ్రద్ధ లేదన్నారు. పటాన్ చెరు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం 30 సంవత్సరాల నుండి కార్యాచరణ నడుస్తుందని, ఇది ప్రజల విజయం అన్నారు. దానిని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఎంతగానో ఉందన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు, నేడు చెప్పిన హామీలే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రెండుసార్లు ప్రజలు నమ్మి అధికారాన్ని ఇచ్చారని ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించిన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కాట శ్రీనివాస్ గౌడ్ నిరసన వ్యక్తం చేసి ధర్నా చేశారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రెసిడెంట్స్ సుధాకర్ గౌడ్, వడ్డె క్రిష్ణ, అశోక్, నర్సింగ్ రావు, ఎంపీపీ రవీందర్ గౌడ్, ఎంపీటీసీలు నరేందర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, కార్పొరేషన్ డివిజన్ ప్రెసిడెంట్స్ ఈశ్వర్ సింగ్, శ్రీనివాస్, మున్సిపాలిటీ ప్రెసిడెంట్స్ ఎల్.రవీందర్, శశిధర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్, రాంసింగ్ నాయక్, రెడ్డి సరితా రెడ్డి, పావని రవీందర్, మైనారిటీ ప్రెసిడెంట్ హబీబ్ జానీ, నాయకులు శ్యామ్ రావు, వీరారెడ్డి, శ్రీహరి, యాదగిరి, వెంకట్ గౌడ్, శ్రీనివాస్, వాజీద్, నవారి శ్రీనివాస్ రెడ్డి, కెఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.