మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం పాదయాత్రగా నిర్వహించారు. బీసీ వ్యక్తి గా, బిఆరెస్ పార్టీ చేసిన సేవలు గుర్తించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షులు చెన్నం రాజు, వార్డ్ మెంబర్లు జంగయ్య, సతీష్ ముదిరాజ్, నరేష్, అంజమ్మ ఏరియా కమిటీ మెంబర్లు రాజు ముదిరాజ్, అశోక్ యాదవ్, జగదీశ్ మరియి బూత్ ఇంచార్జిలు బూత్ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
