బి.ఆర్.ఎస్ పార్టీ నాయకుడు పృథ్వీరాజ్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్నటువంటి శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, ఎం.డి.ఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్ లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. దేవాలయ అధ్యక్షుడు రఘు, మాజీ వార్డ్ మెంబర్ యాదగిరి మరియు గ్రామస్తులు సమక్షంలో ఈ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ భక్తుల ఆధ్యాత్మిక శ్రద్ధను ప్రోత్సహించేలా అన్ని మతాల దేవాలయాల అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. గత మూడు తరాలుగా మా కుటుంబం పేదల అభ్యున్నతికి అంకితభావంతో సేవలందిస్తోంది. ఇళ్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను మా కుటుంబం చేపట్టి ప్రజల సంక్షేమానికి పాటుపడుతోంది. ఇప్పుడు నేనూ మా కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, పటాన్చెరు పెద్దల సహకారంతో మరింత సమగ్రంగా ముందుకు సాగుతాను. భవిష్యత్తులో ప్రజలు ఆశించే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని పృథ్వీరాజ్ అన్నారు.