వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేత…
పటాన్ చెరు:
పటాన్ చెరు మండల పరిధిలోని ఐనోల్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ సమీపంలోని వృద్ధాశ్రమంలో స్నేహితులతో కలిసి నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…
తన సోదరుడు శివారెడ్డి సలహా మేరకు పప్పు దినుసులు ,బియ్యం, వంటనూనె ,కూరగాయలు ,పండ్లను వృద్ధాశ్రమంలో అందజేశామన్నారు.సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరూ ఆశ్రమాలకు తమకు తోచిన సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ.. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా ఆశ్రమాలు. వృద్ధాశ్రమానికి తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐనోల్ గ్రామ యువకులు శశి ,మహేందర్ ,శ్రావణ్ కళ్యాణ్ ,చింటూ తదితరులు పాల్గొన్నారు.