_రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ప్రవీణ్
_ప్రవీణ్ కు చెందిన రెండు కిడ్నీలు, లివర్ ను దానం చేసిన కుటుంబ సభ్యులు
_చనిపోయిన తర్వాత జీవించే అవకాశం ఒక్క అవయవదానం ద్వారానే కలుగుతుంది – సుధీర్ రెడ్డి
మనవార్తలు ,రుద్రారం:
మనిషి చనిపోయిన తర్వాత జీవించే అవకాశం ఒక్క అవయవదానం ద్వారానే కలుగుతుందని రుద్రారం గ్రామ ఉప సర్పంచ్ యాదయ్య అన్నారు. దేశంలో ఏటా ఐదు లక్షల మంది అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. మనిషి బతికి వున్నప్పుడే కాదు ,చనిపోయినప్పుడు తర్వాత అవయవాలు దానం చేసి మరికొందరు జీవితాల్లో వెలుగు నింపవచ్చని ఆయన తెలిపారు. అవయవదానానికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పెద్దబోతుల ప్రవీణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే హైదరాబాద్ నానక్ రాం గూడలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యుల బృందం బ్రెయిన్ డెడ్ గా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న జీవన్ ధాన్ బృందం ప్రవీణ్ కుటుంబ సభ్యులను కలిసి అవయవదానం చేసేందుకు ఒప్పించారు. దీంతో వెంటనే ప్రవీణ్ కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు అంగీకరించారు.
దీంతో బ్రెయిన్ డెడ్ అయిన ప్రవీణ్ రెండు కిడ్నీలు, లివర్ సేకరించి మరో ముగ్గురికి ప్రాణదానం చేశారు. మన దేశంలో అవయవదానంపై అనేక అపోహలు ఉన్నాయని..మూడనమ్మకాలతో అవయవదానం చేసేందుకు ముందుకు రావడంలేదని ప్రవీణ్ తండ్రి తెలిపారు . దానాల్లో అన్నదానం గొప్పదని పూర్వం అనేవారని..కానీ ఇప్పుడు అన్ని దానాల కంటే ప్రాణదానం గొప్పది .ప్రాణదానానికి దోహదపడే అవయవదానం మరింత గొప్పది. అవయవదాన ప్రాధాన్యంపై కొన్ని అపోహలూ ఉన్నాయని.. వాటిని తొలగించుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉంది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీ హరి ప్రసాద్ రెడ్డి ,వార్డు సభ్యులు నారాయణ రెడ్డి, శ్రీనివాస్ ,రాజిరెడ్డి, మరియు అమరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్, రెడ్డి ,కంచరి శ్రీనివాస్, ఎల్లయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య భాస్కర్ గ్రామ యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు