ఎస్ డీ వరప్రసాద్ కు డాక్టరేట్

Districts Hyderabad Telangana

పటాన్‌చెరు:

సాధారణ అంతర్జాల శోధన పద్ధతులను ఉపయోగించిన నిర్ధారిత సమాచారాన్ని పొందడానికి ఆధునిక విధానాలను రూపొందించి, సిద్ధాంత వ్యాసం సమర్పించిన పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సెర్చ్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ డీ వరప్రసాద్ కు డాక్టరేట్ వరించింది. ఈ విషయాన్ని మంగళవారం విడుదల పేర్కొన్నారు. ఉషా రమ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ కె .రాజశేఖరరావు మార్గదర్శనంలో పరిశోధనలు చేసి గుంటూరు లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాకు ఆయన అర్హత సాధించినట్టు తెలిపారు.

యూనిఫామ్ రిసోర్స్ లింక్ (యూఆర్ఎల్ లేదా ఏకరీతి వనరుల లింక్) ద్వారా అనుసంధానం అవుతుందో లేదో తనిఖీ చేయడానికి మిశ్రమ (హెబ్రీడ్) విధానాన్ని ఉపయోగించి అంతర్జాల సమాచారాన్ని భద్రంగా సేకరించడానికి ఈ పరిశోధనలో ప్రాధాన్యం ఇచ్చినట్టు వివరించారు. మనం ఒక పనికోసం వినియోగిస్తున్న యూఆర్ఎల్ హానికరమైనదా, కాదా అని కనుగొనడంలో ఉత్తమ ఫలితాలను కనబరచిందని, ముఖ్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, బిల్లు చెల్లింపుల వంటి ఆర్థిక లావాదేవీలకు ఈ ఆధునిక విధానం ఉత్తమమైనదని పేర్కొన్నారు.

ఈ సిద్ధాంత వ్యాసంలో పేర్కొన్న మిశ్రమ విధానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేసిన అప్లికేషన్ సెబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వంటి పలు రంగాలలో ఉపయోగించవచ్చని తెలియజేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన వరప్రసాద్ ను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఏకే మిట్టల్, అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *