పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)పై పెట్టుబడిదారుల ప్రవర్తన – ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల మ్యూచువల్ ఫండ్ ల అధ్యయనం’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి కొత్తమారం వెంకట రామిరెడ్డిని డాక్టరేట్ వరించింది. గీతం బిజినెస్ స్కూల్-హెదరాబాద్ పూర్వ ప్రొఫెసర్ ఏ.శ్రీరామ్ ఈ పరిశోధనకు మార్గదర్శనం వహించినట్టు విశ్వవిద్యాలయ వర్గాలు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించాయి.నేరుగా వృద్ధిచెందే ఈఎల్ఎస్ఎస్ మ్యూచవల్ ఫండ్స్ పబ్లిక్-ప్రైవేటు రంగ బ్యాంకుల విశ్లేషణాత్మక అంచనా, మెరుగైన పెట్టుబడి నిర్ణయాల లక్ష్యంగా ఈ అధ్యయనం సాగినట్టు పేర్కొన్నారు.పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రైవేటురంగ ఈఎల్ఎస్ఎస్ ఫండ్లలో యాక్సిల్ దీర్ఘకాలిక ఈక్విటీ ఫండ్లతో పాటు ప్రభుత్వ రంగ బీవోఐ ఏఎక్స్ పన్ను రాయతీలున్న ఫండ్ల లో పెట్టుబడి, పెట్టవచ్చనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిపారు.
రామిరెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, గీతం బిజినెస్ స్కూల్-హెదరాబాద్ డెరైక్టర్లు ప్రొఫెసర్ బి.కరుణాకర్, ప్రొఫెసర్ వినయ్ కుమార్ అప్పరాజు, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…