ప్రసాదరావుకు డాక్టరేట్ ‘

Districts Telangana

మనవార్తలు ,పటాన్ చెరు;

తెలుగు కోసం నియమ – ఆధారిత అనువాద ఉపరితలం , పీవోఎస్ టాగర్ ‘ విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి పి.ప్రసాదరావును డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . ఈ సిద్ధాంత వ్యాసం ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన తెలుగు కోసం అనువాద ఉపరితల రూపకల్పన , అభివృద్ధిపై పరిశోధించినట్టు తెలిపారు .

అనువాద ఉపరితలం అనేది సహజ భాషా ప్రాసెసింగ్ ( ఎన్ఎల్పీ ) సిస్టమ్లోని మాడ్యూల్ అని , ఇది తెలుగు వాక్యాలను ఇన్పుట్గా అంగీకరించి , అన్ని వ్యాకరణ , వాక్య నిర్మాణ లక్షణాలతో అనుబంధించినట్టు పేర్కొన్నారు . ప్రసాదరావు సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *