గీతం అధ్యాపకుడు శ్రీనివాస్ కు డాక్టరేట్ …

Hyderabad politics Telangana

పటాన్ చెరు:

ఇండక్షన్ మోటారు సెన్సార్లు లేకుండా వాహక నియంత్రణపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డ్రీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్ ను డాక్టరేట్ వరించింది . పెద్దరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ( జెఎ టీ యుహెచ్ ) లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్ కేంద్రం డెరైక్టర్ డాక్టర్ ఎస్.తారా కళ్యాణి ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు .

పరిశ్రమలో పని గుర్రం లాంటి ఇండక్షన్ మోటార్ ( ఐఎం ) ను డీసీ మోటార్ మాదిరిగా నియంత్రించలేమని , ఆ పరిమితిని అధిగమించి వేగాన్ని అదుపు చేయగలిగినట్టు తెలియజేశారు . ఈ పరిశోధనకు కృత్రిమ మేథను వినియోగించి ఖచ్చితత్వాన్ని మరింత మెరుగుపరవచ్చన్నారు . డీసీ మోటార్‌ ను ఇండక్షన్ మోటార్ తో భర్తీ చేయొచ్చని స్పష్టీకరించారు .

శ్రీనివాస్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం జెఎన్ టీయూ హైదరాబాద్ నుంచి పీహెచ్డీ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *