పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి కొప్పుల సురేష్,డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘యురేనియం, స్ట్రోంటియం, సీసీయంల తొలగింపు కోసం MOFs (స్థిరమైన లోహ-సేంద్రీయ (ఫ్రేమ్ వర్క్), వాటి మిశ్రమాల సంశ్లేషణ, లక్షణం’ అనే అంశంపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం.ఎస్.సురేంద్ర బాబు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సముద్రపు నీరు, భూగర్భ జలాలలో హెవీ మెటల్ కాలుష్యం ఒక క్లిష్టమైన సమస్య. ఇది పర్యావరణం, మానవ ఆరోగ్యానికి గణనీయమైన నష్టాలను కలిగిస్తుంది. ఈ మూలకాలు మానవులు, ఇతర జీవులకు తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. పలు లోపా-సేంద్రీయ (ఫ్రేమ్ వర్క్ ల యాసిడ్-స్థిరమైన మిశ్రమాలను సంశ్లేషణ చేయడంపై ఈ పరిశోధన దృష్టి సారించింది. ఇది సముద్రపు నీటి ద్రావణాల నుంచి కాలుష్యాన్ని తొలగించడానికి విజయవంతంగా ఉపయోగపడ్డాయి’ అని డాక్టర్ సురేంద్ర తెలియజేశారు. అంతేగాక ఈ కాలుష్య కారణాలను సముద్రపు, అణు వ్యర్థాల నుంచి సమర్థంగా తొలగించామన్నారు. ఈ పరిశోధన ద్వారా ప్రజారోగ్యంలో హెవీ మెటల్ కాలుష్యం వల్ల కలిగే పర్యావరణ ప్రమాదాలను పరిష్కరించడానికి ఉపకరించినట్టు ఆయన తెలిపారు.సురేష్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెన్స్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, సలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.