దేశం కోసం ఏదో ఒకటి చేయండి… – డాక్టర్ బుద్ధా

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

మన దేశ పౌరులు , లేదా అధ్యాపకులు … ప్రతి ఒక్కరూ దేశం కోసం తమకు చేతనైన సాయం ఏదో ఒకటి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ముఖ్య సమన్వయాధికారి డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు . గీతం డీమ్డ్ : విశ్వవిద్యాలయం , హెద్దరాబాద్ లోని అధ్యాపకులు , విద్యార్థులతో శనివారం ఆయన సమావేశమయ్యారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , ప్రతి ఒక్క అధ్యాపకుడు కొంత సమయాన్ని పేదల కోసం కేటాయించి వారికి విద్యా బుద్ధులు నేర్పాలని కోరారు . ఆంగ్లేయుల విద్యా విధానం మనని పనివారిగానే చేసిందని , వారు విద్యలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల కొద్దిమంది ఉన్నత వర్గాల పౌరులకు మాత్రమే ప్రయోజనం చేకూరిందన్నారు . మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఇప్పటికీ ఆంగ్ల మాధ్యమం గ్రామీణ యువతకు పెద్ద సవాలుగానే ఉందన్నారు . దానిని అధిగమించడం కోసం కొద్దిమంది ఔత్సాహికులతో కలిసి తాము ఆంగ్ల మాధ్యమంలోని పుస్తకాలను 12 భారతీయ భాషలలోకి తర్జుమా చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పారు .

అలాగే రెత్తులు తమ పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా భాష అడ్డంకి కాని విధంగా సాఫ్ట్వేరు అభివృద్ధి చేశామని , ఓ తెలుగు రెత్తు అధిక ధర లభించే ఏ రాష్ట్రంలోని వారికెనా తమ ఉత్పత్తులను అమ్ముకునేలా చేస్తున్నట్టు చెప్పారు . ఉమ్మడి కుటుంబాలు నుంచి చిన్న కుటుంబాలకు మారినా , ఆయా వ్యక్తుల మధ్య తగినంత సంభాషణ కొనసాగడంలేదని , బాంధవ్యాలు ఉండడంలేదని , వాటిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని ఇతర సభ్యులతో రోజులో కనీసం ఓ గంట అయినా మనసు విప్పి మాట్లాడాలని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు . అందరూ తమ దేశం హితం కోసం యోచించి , పురోభివృద్ధి వెపు అడుగులేస్తే మన దేశం అభివృద్ధి చెందుతున్నదిగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలదని ఆయన అభిలషించారు .

మనదేశంలోని విద్యా విధానానికి , వాస్తవ నెపుణ్యాలకు మధ్య అంతరం చాలా ఉందని , ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బంగారు పతకం పొందిన విద్యార్థి చిన్న ప్యాన్ను రిపేరు చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉందని , దానిని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు . నెపుణ్యం గల యువతను మనం తయారు చేయగలిగితే కనీసం ఐదు శాతం నిరుద్యోగితను తగ్గించగలమని , అంటే దాదాపు ఐదు కోట్ల మంది భవిష్యత్తును మార్చగలమని చెప్పారు . మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో తాము ఆ దిశగా అనేక చర్యలు చేపట్టామని , వాటికి ఉన్నత విద్యా సంస్థల చేయూత కూడా లభిస్తే మన దేశాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలమని చెప్పారు .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ కె . దలాల్ మాట్లాడుతూ , విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగి ఉద్యోగాలు ఇచ్చే దశకు చేరాలని అభిలషించారు . ఏదైనా పరిశ్రమ స్థాపించాలంటే కేవలం 10 నుంచి 15 శాతం పెట్టుబడి ఉంటే చాలని , మిగతా సొమ్ము బ్యాంకుల రుణంగా సమకూర్చుకోవచ్చ న్నారు . మనదేశానికి వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈలు 40 నుంచి 45 శాతం ఎగుమతులు చేస్తున్నట్టు చెప్పారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ , మన జాతీయ స్థూల ఉత్పత్తిలో దాదాపు 60 శాతం ఎంఎస్ఎంఈల నుంచే జరుగుతోందన్నారు . విద్యార్థులకు థియరీ బోధించే కంటే ప్రాక్టికల్గా వారితో చేయిస్తూ నేర్పితే మంచి జ్ఞానం వస్తుందని చెప్పారు . అతిథి డాక్టర్ చంద్రశేఖర్ను ఆయన సత్కరించారు . ఇస్కాన్కు చెందిన రాధా ప్రమోదాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *