పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు : సింధూ ఆదర్శ్ రెడ్డి
వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించిన వద్దంటూ భారతి నగర్ కార్పొరేటర్ ఆదర్శ రెడ్డి అన్నారు. కాలనీలో అపరిశుభ్రమైన నెలకొనడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ విషయంలో కార్మికులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు .భారతి నగర్ కార్పొరేటర్వెన్నవరం సింధు ఆదర్శ్‌రెడ్డి LIG లోని వార్డ్ ఆఫీస్ లో GHMC, AMOH రంజిత్ సింగ్,శానిటేషన్ సిబ్బంది తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
పారిశుద్ద్య నిర్వహణపై సిబ్బంది కి పలు సూచనలు చేశారు. పారిశుద్ద్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్ట చేశారు. అధికారులు సిబ్బంది జవాబుదారితనంతో పని చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులోఉండాలన్నారు. కొన్ని SFA విధి నిర్వహణ లో ఫిర్యాదులు అందడం తో వారిని మార్చాలని సూచించారు . విధి నిర్వాహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నిత్యం రోడ్లను కచ్చితంగా శుభ్రం చేసే విధంగా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, పని చేయని వారిని పక్కన పెట్టాలని అధికారులకు సూచించారు. సిబ్బంది కొరత ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పట్టణ ప్రగతి జులై మొదటి వారం లో మొదలవుతుండడం తో కాలనీ లో వచ్చిన ఫిర్యాదులతో పరిశుభ్రం చేసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు . ఈ కార్యక్రమంలో సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్,జీలాని తదితరులు పాల్గొన్నారు.