మనవార్తలు ,బొల్లారం:
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లో అందించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసి ప్రభుత్వానికి సకాలంలో నివేదికలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు .ముఖ్యమంత్రి ఆశా వర్కర్లను పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్షంగా ,ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు మీరు ,కరోనా సమయంలో మీరు చేసిన సేవలు ,ఫివర్ సెర్వేలో కూడా మీ సేవలు మరువలేవివని,కొలన్ రోజా బాల్ రెడ్డి తెలిపారు.ఈకార్యక్రమంలో డాక్టర్. రాధిక,సిహెఓ పీహెచ్ఎన్ స్వరూప మరియు హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు.