మనవార్తలు , పటాన్ చెరు
రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని పటాన్చెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ లో వివేకానంద కాలనీలో కీర్తిశేషులు జైపాల్ రెడ్డి జ్ఞాపకార్థం సాయి త్రిశూల్ సేవా సమితి ఆధ్వర్యంలో వంద మైనార్టీ కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ తోఫా ను సాయి త్రిశూల్ సేవా సమితి నాయకులు సునీల్ రెడ్డి కానుకగా అందించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు, రంజాన్ మాసం తమకెంతో పవిత్రమైంది అని రంజాన్ మాసంలో సర్వ మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని అయితే పండుగల వేళ నిరుపేద ప్రజానీకం నూతన వస్త్రాలు తెచ్చుకునే పరిస్థితి లేకపోవడం గుర్తించి సాయి త్రిశూల్ సేవా సమితి వారు రంజాన్ తోఫాను అందించామని రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సోదరులకు సూచించారు. ఈ పండుగను సోదరభావంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సాయి త్రిశూల్ సేవా సమితి నాయకులు సునీల్ రెడ్డి తెలిపారు
ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ముస్లిం మహిళా సోదరి మాట్లాడుతూ మాకు జైపాల్ రెడ్డి అన్న లేని లోటుని సునీల్ రెడ్డి అన్న తీరుస్తున్నాడు అని అన్నారు. అన్నగారికి మేము ఎప్పుడు మా తరపున రుణపడి ఉంటామని మరియు సునీల్ రెడ్డి అన్న గారిని అల్లా చల్లగా చూడాలని వాళ్ల కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నామని అన్నారు.. అలాగే సోదరి మాట్లాడుతూ మా ముస్లిం కుటుంబాలకు అనే కాకుండా ఎవరినైనా సమానంగా చూసిన వ్యక్తి మాకు రంజాన్ పండుగ వచ్చిందంటే ముందుండే వ్యక్తి జైపాల్ రెడ్డి అన్న అని అన్నారు .కీర్తిశేషులు జైపాల్ రెడ్డి అన్న ఈరోజు ఆయన మన మధ్యలో లేనందువలన చాలా భాధగా ఉందని అల్లా వాళ్ల కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థనలు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాయి త్రిశూల్ సేవా సమితి నాయకులు ,యువసేన సభ్యులు నాయకులు, దశరథ్, చెన్నంరెడ్డి, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, వెంకట్ గౌడ్, డీను, విక్కీ, కాలనీవాసులు ముస్లిం సోదరా సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు,
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…