పెద్దపల్లి
ఏ గోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతున్న సేవాకార్యక్రమాలు పెద్దపల్లి జిల్లా,ఓదెల మండలంలోని కొలనూర్,గుంపుల ,పొత్కపల్లి ,కనగర్తి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 750 మంది విద్యార్థులకు ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు సదయ్య గౌడ్ ₹34000/- రూపాయల విలువ గల N95 మాస్కులను ఒక్కో విద్యార్థికి రెండు చొప్పున పంపిణీ చేసారు.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంఇఓ అరెపల్లి రాజయ్య గారు,కొలనూర్ ఎంపిటిసి కారెంగుల శ్రీనివాస్ గారు, కనగర్తి సర్పంచ్ కోట దామోదర్ గారు హాజరయ్యారు. ట్రస్టు అధ్యక్షుడు సదయ్య గౌడ్ మాట్లాడుతూ ఎలిగేడు మండలంలో 768 మంది విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశామన్నారు. అలాగే గత పదిహేడు సంవత్సరాలుగా ట్రస్టు ద్వారా పెద్దపల్లి డివిజన్ పరిధిలో నిరుపేద కుటుంబాలకు ఎన్నో సేవకార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల HM లు సత్యనారాయణ, ఏ నరేంద్ర చారి, పుల్ల సదయ్య గౌడ్,శనిగరపు రమేష్, వేగోళం కిరణ్ గౌడ్,తుమ్మల దామోదర్, అకాల సంపత్ రెడ్డి,ఆది సతీష్, తూడి రాజేందర్, తాటిపెళ్ళి శ్రీనివాస్, చర్లపల్లి సాయితేజ గౌడ్,అలుగువెళ్లి ఉబయ్ రెడ్డి, చర్లపల్లి రాజు గౌడ్,సామ చిన్న శంకర్,కొంగరి అనిల్,చినాల సుమన్, తోకల సమ్మయ్య,జిదుల రాజయ్య , తదితరులు పాల్గొన్నారు.
