మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
సుదీర్గ రాజకీయ అనుభవజ్ఞుడు,తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిలబెట్టిన దార్శనికుడు,బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ ఏరియా ఆసుపత్రి లో పేషెంట్ లకు శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు శ్రీ కే సి ఆర్ పుట్టిన రోజు సందర్బంగా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి లో పండ్ల పంపిణి చేయడం జరిగిందన్నారు. ఆ భగవంతుడు కేసిఆర్ చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో రాగం జంగయ్య యాదవ్, దారుగుపల్లి నరేష్, రాజు ముదిరాజ్, అశోక్ యాదవ్,రాగం శంకర్ యాదవ్, రమేష్ గౌడ్,నారాయణ, శామ్లెట్ శ్రీనివాస్, భిక్షపతి, పరమేష్,అజయ్ గౌడ్,అలీం, ఖాదర్ ఖాన్, సుగుణ, బాలమణి, సాయి, సుదర్శన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
