శ్రీ సత్య సాయి సేవా సమితి ,బంజారా సేవ సంఘo ఆధ్వర్యంలోపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Hyderabad Telangana

మనవార్తలు , శేరిలింగంపల్లి :

మియాపూర్ డివిజన్ పరిధిలో శ్రీ సత్య సాయి సేవా సమితి ప్రశాంత్ నగర్ వారు, అల్ ఇండియా బంజారా సేవ సంఘo ఆధ్వర్యంలో మియాపూర్ ప్రాంతం లో పేదలు నివాసం ఉంటున్నా ఓంకార్ నగర్, నడిగడ్డ తండా, సుభాష్ చంద్ర బోస్ నగర్, కాలనీలలో ముఖ్యం గా ఓంకార్ నగర్ బస్తి లో నివాసం ఉంటున్న పేదలను, వృద్దులను గుర్తించి వారం రోజులకు సరిపడే బియ్యం, పప్పు, ఉప్పు కారం, ఆయిల్ పాకెట్స్, గ్లాస్, ప్లాట్స్, బట్టలు,ఓంకార్ నగర్, నది గడ్డ తండా , ఎస్.బి.సి నగర్ లలో మానవత్వం తో శ్రీ సత్యసాయి సేవ సమితి వారు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమం లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ్ నాయక్, ఓంకార్ నగర్ కమిటీ సభ్యురాలు విమల, తండా సభ్యులు డి నర్సింహా, తుకారం నాయక్, శ్రీ సత్య సాయి సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *