పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
క్రైస్తవులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని చర్చిలకు స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు కేకులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం పటాన్చెరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి చర్చి పాస్టర్లకు కేకులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే జిఎంఆర్ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.