Hyderabad

క్రమశిక్షణకే పెద్దపీట… – ఎన్ సీసీ క్యాంపు ప్రారంభోత్సవంలో కల్నల్ ఎస్.కె సింగ్

పటాన్‌చెరు:

క్రమశిక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, చెప్పిన సమయానికి తగిన దుస్తులలో క్యాడెట్లు హాజరై ఈ పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరాన్ని (సీఏటీసీ) సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డిలోని 33వ తెలంగాణ ఎన్ సీసీ బెటాలియన్ పాలనాధికారి కల్నల్ ఎస్.కె సింగ్ సూచించారు. పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఎన్ సీసీ క్యాంపును గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 450 మంది క్యాడెట్లు, 50 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాడెట్లు అత్యుత్తమ లక్షణాలు, పరిపక్వత, క్రమశిక్షణతో పాటు అత్యున్నత ప్రమాణాలను పాటించాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ (ఆర్డీసీ) కవాతు కోసం క్యాడెట్ల ఎంపికతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేయడం, విలువలను పెంపొందించడం, మన ఘన సంస్కృతిని తెలుసుకోవడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

పది రోజుల పాటు జరిగే ఈ శిక్షణా శిబిరంలో క్యాడెట్లు హృదయపూర్వకంగా పాల్గొని గరిష్ట ప్రయోజనాలను పొందాలని, అదే సమయంలో కోనిడ్ -19 నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ఈ క్యాంపులో ఆయుధ శిక్షణ, డ్రిల్, ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, వ్యక్తిత్వ వికాసం, యోగా వంటిని తమ శిక్షకులు నేర్పిస్తారని కల్నల్ ఎస్.కె సింగ్ తెలిపారు. ఈ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో సుబేదార్ మేజర్ కేసర్ రాణా, పలువురు శిక్షకులు, ఎన్ సీసీ అనుబంధ అధికారులు తదితరులు

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

10 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

12 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago