Hyderabad

ముత్తంగి పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

– ఇస్నాపూర్ పాలకవర్గానికి షోకాజ్ నోటీస్

– సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పటాన్‌చెరు:

అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ కార్యదర్శిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తంగి కార్యదర్శి కిషోర్ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇవ్వగా, జిల్లా పంచాయతీ అధికారి తనిఖీలో అక్రమ నిర్మాణాలు గుర్తించి, వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, తొలగించడంలో నిర్లక్ష్యం వహించినందున సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ పాలకమండలి అనుమతి లేని లే అవుట్లలో గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి తీర్మానించి, అనుమతులు ఇచ్చినందున  సంబంధిత గ్రామ పంచాయితీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇస్నాపూర్ పంచాయతీ కార్యదర్శి వై.హరిబాబుకు చార్జి మెమో ఇచ్చి, బదిలీ ఉత్తర్వులు జారీ చేశామని ఆయన తెలిపారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పటాన్‌చెరు మండల పంచాయితీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago