పటాన్‌చెరు:
క్రమశిక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, చెప్పిన సమయానికి తగిన దుస్తులలో క్యాడెట్లు హాజరై ఈ పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరాన్ని (సీఏటీసీ) సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డిలోని 33వ తెలంగాణ ఎన్ సీసీ బెటాలియన్ పాలనాధికారి కల్నల్ ఎస్.కె సింగ్ సూచించారు. పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఎన్ సీసీ క్యాంపును గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 450 మంది క్యాడెట్లు, 50 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాడెట్లు అత్యుత్తమ లక్షణాలు, పరిపక్వత, క్రమశిక్షణతో పాటు అత్యున్నత ప్రమాణాలను పాటించాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ (ఆర్డీసీ) కవాతు కోసం క్యాడెట్ల ఎంపికతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేయడం, విలువలను పెంపొందించడం, మన ఘన సంస్కృతిని తెలుసుకోవడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
పది రోజుల పాటు జరిగే ఈ శిక్షణా శిబిరంలో క్యాడెట్లు హృదయపూర్వకంగా పాల్గొని గరిష్ట ప్రయోజనాలను పొందాలని, అదే సమయంలో కోనిడ్ -19 నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ఈ క్యాంపులో ఆయుధ శిక్షణ, డ్రిల్, ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, వ్యక్తిత్వ వికాసం, యోగా వంటిని తమ శిక్షకులు నేర్పిస్తారని కల్నల్ ఎస్.కె సింగ్ తెలిపారు. ఈ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో సుబేదార్ మేజర్ కేసర్ రాణా, పలువురు శిక్షకులు, ఎన్ సీసీ అనుబంధ అధికారులు తదితరులు