మన వార్తలు, శేరిలింగంపల్లి :
సంపాదనే ముఖ్యం కాదని, సంపాదనలో పేదల చదువులకు సాయం చేయడం గొప్ప విషయమని నమ్మే ధాత్రి నాథ్ గౌడ్ అందుకు గాను సంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామం లో గౌడ్ కులస్తుల పిల్లల చదువు కోసం నిర్మిస్తున్న హాస్టల్ భవన నిర్మాణానికి తన తండ్రి నిమ్మల మనోహర్ గౌడ్ జ్ఞాపకార్ధం 5 లక్షల విరాళాన్ని శేరిలింగంపల్లి గౌడ సొంఘం అధ్యక్షులు దొంతి లక్ష్మి నారాయణ గౌడ్ కు శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని హాఫిజ్ పేట్ కు చెందిన సింధు ధాత్రి నాథ్ గౌడ్ దంపతులు తన తల్లి సుభద్ర దేవి చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్బంగా ధాత్రి నాథ్ గౌడ్ మాట్లాడుతు పేదల చదువుకోసం నిర్మిస్తున్న హాస్టల్ భవనం లో తన తండ్రి పేరు మీద ఒక గదిని నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మనోహర్ గౌడ్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు, ఇక ముందు ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందనీ పేర్కొన్నారు.
