ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ధరణి_ మంత్రి దామోదర రాజనర్సింహా

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మీచరిత్ర చెప్పమంటారా..? మాజీ మంత్రి హరీష్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయ్? వంగి వంగి కాళ్ళు మొక్కింది ఎవరు? ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ఉందంటే ధరణి”యేనని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. పటాన్ చెరు అసెంబ్లీ లో సోమవారం సాయంత్రం 18న జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశం గురించి ఆర్ సి పురం లోని శ్రీ కన్వెన్షన్ హాలులో నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహా బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. రబ్బరు చెప్పులు వేసుకుని వచ్చిన హరీష్ రావుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి.. చరిత్ర చెప్పమంటావా? అంటూ వ్యాఖ్యానించారు. వంగి వంగి ఎవరు కాళ్ళు మొక్కిండు, ని అప్పుడున్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కాదా.! చరిత్ర చెప్పనా అని అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు కలెక్టర్ ఎవరు.? దానివల్ల ఎంతమంది నిర్వాసితులు భూమిని కోల్పోయారు చెప్పమంటావా? అన్నారు. ప్రజా వేదిక పెట్టుకుని చెప్పమంటారా? అని ప్రశ్నించారు.

ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ఉందంటే ధరణి మాత్రమేనని స్పష్టం చేశారు. 7 లక్షల కోట్లు అప్పుల పాలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడమంటారా? ఆస్తుల గురించి మాట్లాడమంటారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్దాలు మాట్లాడేవారు నాయకులయ్యారని పేర్కొన్నారు. 25 ఏళ్ల కిందట బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి ఇప్పుడు వారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా? అంటూ వ్యాఖ్యానించారు. 18వ తారీఖున సంగారెడ్డి , పటాన్చెరు అందరి చరిత్రను చెబుతానని అన్నారు. నాడు 25 లక్షల భూమిని పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పోచంపాడును కట్టించిందని మంత్రి గుర్తు చేశారు. ఎందరో త్యాగాలను గుర్తించి ఆంధ్రాలో నష్టపోతామని తెలిసినా కూడా పార్లమెంటులో బిల్లు పెట్టింది యూపీఏ గవర్నమెంట్ అని గుర్తుంచుకోవాలన్నారు. ఆనాడు పార్లమెంటులో రెండు సీట్లున్న టిఆర్ఎస్ తెలంగాణ తేలేదని, కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ వచ్చాక అభివృద్ధి, అద్భుతాలు జరుగుతాయని, నమ్మం కానీ తొమ్మిదిన్నర ఏళ్లలో మోసానికి, దగాకు గురి కావలసి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి వాడినైనా చరమగీతం పాడేశక్తి ఒక ఓటు ఆయుధానికే ఉందని స్పష్టం చేశారు. ఓటు ఒక ఆయుధమని, అభ్యర్థి చరిత్ర, ప్రాంతం, కావాల్సింది ఏమిటో సరిగా చూసుకుని ఓటు వెయ్యాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే తత్వం ఉండాలని, ఓటు ఎవరికి వేయాలో ఆలోచించుకోవాలి? ఇప్పుడే అంబేద్కర్ ఆశయం నెరవేరుతుందన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన నీలం మధును గెలిపించుకోవలసిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని మంత్రి పేర్కొన్నారు.

అందరం కలిసి నీలం మధు ముదిరాజ్ గెలిపిద్దాం మంగళవారం
కాటా శ్రీనివాస్ గౌడ్

ఎవరి ఆదేశాలు అవసరంలేదని, పార్టీ ఆదేశాల మేరకు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కోసం పనిచేయాలని పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీ ఆర్ఎస్ కు భయపడకుండా ఎలాగైతే పనిచేశారో? ఈ పార్లమెంటు ఎన్నికలలో పనిచేసి ఈ ప్రాంతం నుంచి అత్యధిక మెజారిటీ సాధించాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎలక్షన్ ఇంచార్జి శ్యామ్,DCC వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు,పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, పీసీసీ మెంబర్ శ్రీనివాస్, బొల్లారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, జిన్నారం ఎంపీపీ రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మండలల అధ్యక్షులు వడ్డే కృష్ణ, నర్సింగ్ రావు, సుధాకర్ గౌడ్,పట్టణ మున్సిపల్ అధ్యక్షులు,పార్టీ ముఖ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *