జాహీరాబాద్:
కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్టణంలోని ఔదుంబరా అలయములో పరమ పూజ్య శ్రీ శ్రీ హవా మల్లినాధ్ మహారాజ్ ని శుక్రవారం రాత్రి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్,దర్శించుకున్నారు.ప్రజలని ఆద్యాత్మక బోధన ద్వారా దేశ భక్తి ని పెంపొందించి అన్నిమతముల సారం ఒక్కటే అని అది శాంతి, మన ఐక్యత, సోదర భావం కలిగి ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశ్యంతో జై భారత్ సేవాసమితిని స్తాపించి సేవా కార్యక్రమాలతో పేద ప్రజల ని ఆదుకున్నారు అని వారి సేవలని కొనియాడారు.
మహోన్నత ఆశయం తో దేశంలో ఆయా రాష్ట్రాల లో 5 వేల ఆశ్రమాలు ఏర్పాటు చేసి ప్రతి ఆశ్రమమము లో అన్నదానం చేపట్టడము అభినందనీయం అని ఆయన అన్నారు ఎంపీ బీబీపాటిల్ తో పాటు జై భారత్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర శాఖ అద్యక్షులు లద్దె నాగరాజు ఈ మహత్తర కార్యక్రమములో పాల్గొన్నారు.