మనవార్తలు,సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని వివేకానంద ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించే మెన్స్ డబుల్ ఫస్ట్ ఎడిషన్ వివేకానంద బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను పటాన్ చెరు మాజీ సర్పంచ్, వివేకానంద ఇండోర్ స్టేడియం చీఫ్ పట్టర్న్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు శనివారం టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేందర్ రాజు గారు మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. విద్యార్థులు యువకులు చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలని సూచించారు.
ఈ క్రీడలను నిర్వహిస్తున్న వివేకానంద ఇండోర్ స్టేడియం అధ్యక్షుడు ది రాజేందర్ ను ఆయన అభినందించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో విజేతలకు మొదటి బహుమతి పది వేలు, రెండవ బహుమతి ఐదువేల రూపాయలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పటాన్చేరు కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, చందు గారు, అన్వర్ గారు తదితరులు పాల్గొన్నారు.